Monday, 28 December 2015

‘గారు‘ కతేంది?



తెలుగు భాషలో గారు కు మించిన కిరికిరి పదం మరొకటి లేదనుకుంటా. కానీ ఈ గౌరవ సంబోధనలో ఆత్మీయత సున్నా. గౌరవం పదాల్లో ఉండదు, మనసులో, చేతల్లో ఉంటుంది. నాకైతే ఎవరినైనా నువ్వు..అంటూ పిలవాలనిపిస్తుంది అరమరికల్లేకుండా. మా రాయలసీమలో ఈ గారు ఇదివరకు తక్కువగా వినబడేది. ఇప్పుడు జాచ్చి అయింది. దీని పుట్టుపూర్వోత్వరాల వెనక పెద్ద కథే ఉన్నట్టుంది. వేలూరి శివరామశాస్త్రిగారు దీని గురించి ఏమంటున్నారో చదవండి.. ఇది భారతి పత్రికలో వచ్చింది. సంచిక గుర్తులేదు. 




9 comments:

  1. గారు మీరు లాంటి గౌరవ సంబోధనలు తెలంగాణాలో కూడా చాలా తక్కువే. చిన్నప్పుడు ఆంద్ర మిత్రులు నాయనలను "నాన్న గారూ" అంటే నవ్వే వాడిని. నేనెందుకు నవ్వుతున్నానో వారికి అర్ధం అయ్యేది కాదు.

    ReplyDelete
    Replies
    1. మరలా అటుత్రిప్పి ఇటుత్రిప్పి ఆంద్ర-తెలంగాణా అంటూ భిన్నత్వారోపణకు దిగవలసిన పనేమిటండీ. ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతపరిస్థితుల్లో మీరీ‌మాట అనకుండా ఉంటే బాగుండే దనుకుంటాను. ప్రాంతీయమైన చిన్నచిన్న ప్రయోగబేధాలు అన్నిభాషలకు సహజమే. సువిశాలమైన అమెరికాదేశంలో అన్నిరాష్త్రాలలోనూ ఒకఏవిధమైన శ్లాంగ్ మాట్లాడరు. యూకేలోనూ‌ అంతే. తెలుగుప్రాంతా లన్నింటిలోనూ తెలుగు ఒకేవిధంగా కాక కొధ్దికొధ్ది తేడాలతో ఉండటంలో విచిత్రం ఏమీ లేదు. ఒకరి యాసగురించో, వారు ప్రయోగించే పదాలలొను కొత్తదనం గురించో ఆచారవ్యవహారాలలో భాషలోకూడా కనిపించే భిన్నత్వానికో నవ్వుకోవటం సబబుకాదని నా అభిప్రాయం. పోనివ్వండి, మీ చిన్నప్పడు అలా నవ్వుకొనేవారు కాని ఇప్పుడు కాదని ఆశిస్తాను. ఏదైనా మీరు ఆంధ్ర-తెలంగాణా అన్నభీజన రేఖను స్పృశించిమాట్లాడకుండా ఉంటే బాగుండేదని మరొక సారి విన్నవిస్తున్నాను.

      Delete
    2. This comment has been removed by a blog administrator.

      Delete
    3. తమ ప్రాంతంలో గారు అనరు కాబట్టి ఇతర ప్రాంతీయులు తమ ప్రాంతంలో గారు వాడితే నవ్వు రావడం దేనికో?

      మరి ఇతర ప్రాంతీయులు తమ ప్రాంతం యాసని గురించి నవ్వినప్పుడు కినుకా,రోషమూ ఎందుకు వచ్చాయో!ఇతరుల యాసల్ని చూసి మీరు నవ్వొచ్చు గానీ ఇతరులు మాత్రం మీ యాసని నవ్వరాదు,భలే సంస్కారం.

      అంటే తమ ప్రాంతంలో అడుగుపెట్టగానే అందరూ తమ ప్రాంతం మర్యాదల్ని వదిలేసి వీరి ప్రాంతం మర్యాదల్నే పాటించాలని అర్ధమా?

      తెలంగాణా సరిహద్దుల్లో ఈలాంటి ఆచారవ్యవహారలల్ గైడు పుస్తకాలు అమ్మండి జై గారూ,అప్పుడు తెలనగాణలో వేసే తొలి అడుగు నుంచే మీకు నవ్వు రాకుండా మాట్లాడేటందుకు ప్రయత్నిస్తాము,ఏమంటారు?

      Delete
    4. మాస్టారూ, బ్లాగరు "మా రాయలసీమలో ఈ గారు ఇదివరకు తక్కువగా వినబడేది" అన్నారు. తెలంగాణాలో కూడా అంతేనని చెప్పాను తప్ప నేను ఆంధ్రులను కించపరచలేదు.

      మనకు తెలిసిన వారెవరూ చేయని పనులను కొత్తగా చూస్తె పిల్లలకు నవ్వు రావడం సహజమే కదా.

      మీరు గారు లాంటివి వాడాలో వద్దా అనేది ఎవరిష్టం వారిది. ఇందులో ఏది మంచి ఆచారమో ఏది కాదో చెప్పజాలము.

      ఇకపోతే ముక్కు మొహం తెలియని వారిని ఏకవచనంతో అసభ్య పదాలతో సంబోదించే "మర్యాదస్తుల" సలహాలకు థాంక్స్.

      Delete
  2. ‘మృత్యువు లేని వారెవరికినొ గారు లేదు’

    ReplyDelete
  3. బావుంది. నిజమే కదా దేవుడికి గారు లేదుగా!

    ReplyDelete