గోగా కుర్చీ
నికార్సయిన మనిషి కోసం
ఐహిక వాంఛలతో చెలరేగే వాడి కోసం
సౌందర్యబీభత్సాలను పచ్చిగా తాగే ఉన్మాది కోసం
రేకులు విచ్చిన ఆదిమ పుష్పం
లేచిపడిన రంగుల కెరటాల్లో మత్తిల్లిన
నాలుగుకాళ్ల జీవాజీవ మృగయా అస్తిత్వం
ఐహిక వాంఛలతో చెలరేగే వాడి కోసం
సౌందర్యబీభత్సాలను పచ్చిగా తాగే ఉన్మాది కోసం
రేకులు విచ్చిన ఆదిమ పుష్పం
లేచిపడిన రంగుల కెరటాల్లో మత్తిల్లిన
నాలుగుకాళ్ల జీవాజీవ మృగయా అస్తిత్వం
వ్యాన్గో.. మైడియర్ స్నేహోన్మాదీ..!
ఆర్ల్స్ పట్టణ పచ్చఇంటి మాసిన పొద్దులో
నీ మైడియర్ ఆదిమానవ నవకళామిత్రుడు గోగాతో
స్నేహించీ, అలకించీ, విరోధించీ, విలపించీ..
జట్టుపీక్కున్న నీ చేతులు ప్రసవించినది కదా ఇది..
ఆర్ల్స్ పట్టణ పచ్చఇంటి మాసిన పొద్దులో
నీ మైడియర్ ఆదిమానవ నవకళామిత్రుడు గోగాతో
స్నేహించీ, అలకించీ, విరోధించీ, విలపించీ..
జట్టుపీక్కున్న నీ చేతులు ప్రసవించినది కదా ఇది..
వ్యాన్గో.. మైడియర్ అమాయక చక్రవర్తీ..!
వాంఛోన్మాద గోగా మదగజాన్ని
ఈ అర్భకపు కుర్చీలో కుదేసి
తమాషా చూద్దామనుకున్నావు కదూ..
గోగా పడిచచ్చే ఆడమాంసాన్ని
దీని ఒంపుసొంపుల్లో సొగసుగా కూరావు కదూ..
ఆరని గోగా మదనధ్వజోజ్వలజ్వాలను
నిగిడిన కొవ్వొత్తితో మరింత ఎగదోశావు కదూ..
గోగా గొంతును పచ్చిగా రమించే
యాబ్సింత్ ఆకుపచ్చదనాన్ని గోడకు మస్తుగా దట్టించావు కదూ..

కానీ, కానీ.. మైడియర్ వ్యాన్గో వెర్రినాయనా..!
నీ కళాకారుల కమ్యూన్ ఆశ అడియాశై చేజారిన మణిపూసై
ఈ కుర్చీ చుట్టూతా ఎలా తెలతెల్లగా పగిలి ముక్కలైందో చూశావా కన్నా..
నీ కళాకారుల కమ్యూన్ ఆశ అడియాశై చేజారిన మణిపూసై
ఈ కుర్చీ చుట్టూతా ఎలా తెలతెల్లగా పగిలి ముక్కలైందో చూశావా కన్నా..
కానీ, కానీ.. మైడియర్ కన్నీళ్ల కళారవీ..!
కలత పడకు, కరిగిపోయే రంగవ్వకు
ఈ మాసిన రంగుల.
ఈ రూపాంతర శయనపీఠం..
నీ చెదిరిన కుంచెకలను
కలకాలం మోస్తూనే ఉంటుందిలే..
కలత పడకు, కరిగిపోయే రంగవ్వకు
ఈ మాసిన రంగుల.
ఈ రూపాంతర శయనపీఠం..
నీ చెదిరిన కుంచెకలను
కలకాలం మోస్తూనే ఉంటుందిలే..
విన్సెంట్ వ్యాన్గో 1889లో వేసిన గోగా కుర్చీ బొమ్మ తలపోతలో..
వ్యాన్గో, గోగాలు ఆర్ల్స్ లో కొన్ని నెలలు ఒకే ఇంటిలో ఉండి బొమ్మలేశారు.
వ్యాన్గో, గోగాలు ఆర్ల్స్ లో కొన్ని నెలలు ఒకే ఇంటిలో ఉండి బొమ్మలేశారు.
ఏంది స్వామీ. ఒక పుచ్చకాయ కుర్చీ కోసం ఇంత పెద్ద తవిక అవసరమా?
ReplyDeleteఈ పుచ్చకాయ కుర్చీ తవిక నీకు నచ్చలేదు, బాగానే ఉంది. మరి దీనిపై అనవసరంగా నీ ఎంతో విలువైన కాలాన్ని, శక్తిని వ్రుథా చేసుకుని కామెంటు పెట్టావెందుకు పిచ్చిస్వామీ..?
ReplyDelete