ఇప్పటి తెలుగు వార, మాస పత్రికల్లో ఆర్ట్ విషయాలు కళ్లుచించుకున్నా కనబడవు కాని, 70, 80 ఏళ్ల కిందట అంటే 1930, 1940ల దశకాల్లో భారతి, ఆంధ్రపత్రిక వంటి ప్రసిద్ధ పత్రికలే కాకుండా చిన్నపాటి పత్రికల్లోనూ లలితకళలపై చాలా వ్యాసాలు వచ్చేవి. క్యూబిజం, సర్రియలిజాల గురించి 1920లలోనే వివరించిన కళావిమర్శా చరిత్రి తెలుగువాళ్ల సొంతం. ఇప్పడదంతా గతం. కానీ ముందుకు వెళ్లాలంటే వెనక్కి తిరిగి ఒకసారి గతాన్ని చూడాలి. ఆ ప్రయత్నమే ఇది. పల్లవుల చిత్రకళ గురించి కో. రామమూర్తి రాసిన ఈ వ్యాసం 1949 భారతి నవంబరు సంచికలో వచ్చింది. తమిళనాడులోని పనమలైలో ఉన్న కుడ్యచిత్రాల గురించి ఆయన చెబుతున్నారు. దీనికి నెట్ లోంచి కలర్ ఫొటోలు తీసి జతచేస్తున్నాను. పనమలై చిత్రాలకు అజంతా చిత్రాలు దగ్గరగా ఉన్నాయి చూండడి.(ఇమేజ్ లపైన క్లిక్ చేసి సేవ్ చేసుకుని చూస్తే స్పష్టంగా కనిపిస్తాయి.. ఆసక్తి ఉంటే..)
పనమలైలోని పార్వతి చిత్రం |
పనమలై పార్వతి |
అజంతా వయ్యారి |
No comments:
Post a Comment