Sunday 1 November 2015

అలనాటి గోలకొండా,గుత్తీ, గర్రంకొండా.. విశాఖపట్టణమున్నూ..

మిమ్మల్ని కాసేపు ఈ ట్రాఫిక్ రొద నుంచి, కాంక్రీటు ఉక్క, కందిపప్పు కాకల నుంచి టైమ్ మిషన్ లో అందమైన, అపురూపమైన  అనగనగా ఆనాటి అలనాటి మన తెలుగు సీమల్లోకి తీసుకెళ్తాను. రెండు శతాబ్దాలు వెనక్కి వెళ్లి ఆనాడు హాయిగా, పచ్చగా, విశాలంగా కళకళ్లాడిన  గోల్కొండ ముందు నిలబెడతాను, పక్కనే ఉన్న సువిశాల కుతుబ్ షాహీల పెచ్చులూడని, వసివాడని నునుపైన సమాధుల అందాన్ని చూపిస్తాను. అప్పటి మూసీ వాగువద్దా, తెల్లటి బ్రిటిష్ రెసిడెన్సీలోనూ తిప్పుతాను. హైదరాబాద్ నుంచి దూరంగా తీసుకెళ్లి నిర్మల్ కోటను చూపిస్తాను. మళ్లీ కిందికొచ్చి భద్రాచలం గోపుర దర్శనం చేయించి,  భువనగిరి కోట శిథిలాలను అల్లంత దూరం నుంచి చూపిస్తాను.  తర్వాత పడమటికి తీసుకెళ్లి కర్నూలు ఆదోని కోట, అహోబిలం గోపురం ముందు నడిపించి, ఆకాశాన్నంటే గుత్తికోటను పరిచయం చేస్తాను. తర్వాత ననుగన్న మా పెన్నమ్మ ముద్దాడే గండికోట అందాలు చాలాచాలా పరిచయం చేసి.. ఇదే పెన్న ఇదే పెన్న అని పరమానందంతో పాటపాడి మురిపిస్తాను. తర్వాత  కడప కోట తిప్పి, అస్సార్ గడీ చూపి  కిందికి పట్టుకెళ్తాను. చిత్తూరు గుర్రంకొండను ఎక్కించి దింపి, మళ్లీ పైకి పట్టుకెళ్లి పెన్నమ్మ తాకే సిద్ధవటం కోటను చూపిస్తాను. అట్నుంచి తూర్పుగా మళ్లి నెల్లూరు ఉదయగిరి కోట, పెదనాయకదుర్గం, దరసపట్నం ఆలయాన్ని చూపింసస్తాను. మళ్లీ పైకెళ్లి సముద్రంలాంటి కంభం చెరువు నీళ్లు తాగిస్తాను. కాస్త సేదదీరాక పైకెళ్లి కొండవీడు, బెల్లంకొండ దుర్గాలను ఎక్కించి, యానాం ఏటిగట్టంట నడిపించి, మళ్లీ పైకి పట్టుకెళ్లి విశాఖ యారాడ కొండలో ఒదిగిన పీర్లగుడిని చూపించి, తర్వాత కొండుముందు థీరంలో ముందు వదిలేస్తాను. మన తెలుగుసీమల కాస్త మసకేసిన రంగుల అందాలను, ఆ మహాకడలి తీరంలో సేదదీరి మళ్లీ తీరిగ్గా మననం చేసుకోండి.. తర్వాత మళ్లీ  2015 నవంబర్లోకి వస్తామని అంటే అప్పుడు చూద్దాం..(ఈ చిత్రాలన్నీ కలర్ ప్రింట్లు. నాటి బ్రిటిష్ సర్వేయర్లు, డ్రాఫ్టుమన్లు, కెప్టెన్లు, దేశతిరుగుడు కళాకారులు వేసినవి..)
- పి.మోహన్.


 Golconda by Francis Jukes (1746-1812) and Thomas Anburey (1759-1840).



Kutub Shahi tombs by Robert Melville Grindlay( (1786-1877).


North-East Hyderabad by Francis Jukes (1746-1812) and Thomas Anburey (1759-1840).


British Residency(Hyderabad) by Robert Melville Grindlay (1786-1877).

Bhadrachalam by Blunt, James Tillyer (1765-1834).




Nirmul Fort by Francis Jukes (1746-1812) and Thomas Anburey (1759-1840).


Bhuuvanagiri Fort ruins  by Thomas Anburey (1759-1840)

Ahobilam by Ward, Benjamin Swain (1786-1835).

Adoni Fort by Benjamin Swain Ward (1786-1835).






Gooty east face by Thomas Fraser (1776-1823)




Gooty north face by Thomas Fraser (1776-1823)



Gooty Third Gagte by  Thomas Fraser (1776-1823)



Gooty West face Thomas Fraser (1776-1823)


Gandikota (northern entance) by Thomas Anburey (1759-1840).




Gandikota (north entance) by Thomas Anburey (1759-1840).



Gandikota (southern entance) by Thomas Anburey (1759-1840).



Gandikota (east and south face) by Thomas  Fraser dated 1802.



Gandikota (north face) by Thomas Fraser dated 1802.



Gandikota (west side) by Thomas Fraser dater 1802.


Gandikota (south entance) by Thomas Anburey, (1759-1840).
Udayagiri Fort(Nellore) by Colin MacKenzie dated May 1794






Bellamkonda by  Ignatio, C dated1819




Siddavatam fort north face byThomas Fraser (1776-1823)
Pedaniakaurgam by  John Gant,(1772-1853)
Kambam tank by unknown 1794


Kondavidu Fort  R., William( 1784-1816)


Bellamkonda2 by Colin MacKenzie (1754-1821)


Bellamkonda  by Colin MacKenzie(1754-1821)


Bellamkonda by unnown 1788


Assar fort kadapa by Thomas Fraser (1776-1823)


Gurramkonda by unknown 1790s


Kadapa(south view) by Thomas Fraser (1776-1823).




Gurramkonda north face by Thomas Fraser (1776-1823)



Durasapatam Sydenham, Benjamin (1777-1828)


Yanam river scene by Sigismond Himely (1801-1872


Pir Masjid at Yarada hill by C. Ignatio (1816-1819


Vizag(north view) by  Captain Elisha Trapaud (1750-1828).


Vizag Seashore with Fort by James Tillyer Blunt (1765-1834). 




2 comments: