Sunday, 22 November 2015
Sunday, 15 November 2015
Sunday, 8 November 2015
Wednesday, 4 November 2015
గోయా హృదయ గాయాలు
విఖ్యాత స్పానిష్ చిత్రకారుడు ఫ్రాన్సిస్కో గోయా(1746-1828)పై నా వ్యాసం. గోయా ఆధునిక కళకు బీజవ్యాపనం చేశాడు. అతని జీవితంలో బోలెడంత రొమాన్సుతోపాటు యుద్ధబీభత్సం, మతపీడన వంటివెన్నో ఉన్నాయి. యుద్ధ బీభత్సాన్ని తొలిసారిగా అత్యంత వాస్తవికంగా చూపింది ఆయనే. ఈ వ్యాసం అరుణతార 2006 ఆగస్టు సంచికలో వచ్చింది. చివరి రెండు ఉపశీర్షికలు , ‘చిత్తచాంచల్యాలు’, ‘యుద్ధవైపరీత్యాలు’ అచ్చులో తారుమారయ్యాయి. వీటిని ‘రాజకీయ కల్లోలంలో కాకలు తీరిన కళ’ ఉపశీర్షిక తర్వాత చదువుకోవాలి.
గోయా చిత్రం.. 1808 మే మూడో రోజు (మాడ్రిడ్ తిరుగుబాటుదారులను కాల్చిచంపుతున్న నెపోలియన్ సైనికులు) |
Tuesday, 3 November 2015
ప్రకృతికి పరవశం.. ప్రజలకి ఆత్మీయం.. బ్రూగల్ చిత్ర ప్రపంచం
ఫ్లెమిష్ వర్ణచిత్రకారుడు(1525-1569) వేసిన బొమ్మలను, అతని జీవిత విశేషాలను వివరిస్తూ అప్పటి ఎరుకతో రాసిన వ్యాసం. ఇది అరుణతార 2006 అక్టోబర్ సంచికలో వచ్చింది. బ్రూగల్ వేసిన ఏ చిత్రాన్ని ముట్టుకున్నా మట్టిమనిషి వాసన తగులుతుంది.రాజ్యం తీరును అతడు పరోక్షంగా అయినా ఎంతో ఘాటుగా, కళాత్మకంగా ఎండగట్టిన తీరు బహు ఆసక్తికరమైంది.
బ్రూగల్ కుంచెలో పంటకోతలు |
Sunday, 1 November 2015
అలనాటి గోలకొండా,గుత్తీ, గర్రంకొండా.. విశాఖపట్టణమున్నూ..
మిమ్మల్ని కాసేపు ఈ ట్రాఫిక్ రొద నుంచి, కాంక్రీటు ఉక్క, కందిపప్పు కాకల నుంచి టైమ్ మిషన్ లో అందమైన, అపురూపమైన అనగనగా ఆనాటి అలనాటి మన తెలుగు సీమల్లోకి తీసుకెళ్తాను. రెండు శతాబ్దాలు వెనక్కి వెళ్లి ఆనాడు హాయిగా, పచ్చగా, విశాలంగా కళకళ్లాడిన గోల్కొండ ముందు నిలబెడతాను, పక్కనే ఉన్న సువిశాల కుతుబ్ షాహీల పెచ్చులూడని, వసివాడని నునుపైన సమాధుల అందాన్ని చూపిస్తాను. అప్పటి మూసీ వాగువద్దా, తెల్లటి బ్రిటిష్ రెసిడెన్సీలోనూ తిప్పుతాను. హైదరాబాద్ నుంచి దూరంగా తీసుకెళ్లి నిర్మల్ కోటను చూపిస్తాను. మళ్లీ కిందికొచ్చి భద్రాచలం గోపుర దర్శనం చేయించి, భువనగిరి కోట శిథిలాలను అల్లంత దూరం నుంచి చూపిస్తాను. తర్వాత పడమటికి తీసుకెళ్లి కర్నూలు ఆదోని కోట, అహోబిలం గోపురం ముందు నడిపించి, ఆకాశాన్నంటే గుత్తికోటను పరిచయం చేస్తాను. తర్వాత ననుగన్న మా పెన్నమ్మ ముద్దాడే గండికోట అందాలు చాలాచాలా పరిచయం చేసి.. ఇదే పెన్న ఇదే పెన్న అని పరమానందంతో పాటపాడి మురిపిస్తాను. తర్వాత కడప కోట తిప్పి, అస్సార్ గడీ చూపి కిందికి పట్టుకెళ్తాను. చిత్తూరు గుర్రంకొండను ఎక్కించి దింపి, మళ్లీ పైకి పట్టుకెళ్లి పెన్నమ్మ తాకే సిద్ధవటం కోటను చూపిస్తాను. అట్నుంచి తూర్పుగా మళ్లి నెల్లూరు ఉదయగిరి కోట, పెదనాయకదుర్గం, దరసపట్నం ఆలయాన్ని చూపింసస్తాను. మళ్లీ పైకెళ్లి సముద్రంలాంటి కంభం చెరువు నీళ్లు తాగిస్తాను. కాస్త సేదదీరాక పైకెళ్లి కొండవీడు, బెల్లంకొండ దుర్గాలను ఎక్కించి, యానాం ఏటిగట్టంట నడిపించి, మళ్లీ పైకి పట్టుకెళ్లి విశాఖ యారాడ కొండలో ఒదిగిన పీర్లగుడిని చూపించి, తర్వాత కొండుముందు థీరంలో ముందు వదిలేస్తాను. మన తెలుగుసీమల కాస్త మసకేసిన రంగుల అందాలను, ఆ మహాకడలి తీరంలో సేదదీరి మళ్లీ తీరిగ్గా మననం చేసుకోండి.. తర్వాత మళ్లీ 2015 నవంబర్లోకి వస్తామని అంటే అప్పుడు చూద్దాం..(ఈ చిత్రాలన్నీ కలర్ ప్రింట్లు. నాటి బ్రిటిష్ సర్వేయర్లు, డ్రాఫ్టుమన్లు, కెప్టెన్లు, దేశతిరుగుడు కళాకారులు వేసినవి..)
- పి.మోహన్.
- పి.మోహన్.
Golconda by Francis Jukes (1746-1812) and Thomas Anburey (1759-1840). |
Kutub Shahi tombs by Robert Melville Grindlay( (1786-1877). |
North-East Hyderabad by Francis Jukes (1746-1812) and Thomas Anburey (1759-1840). |
British Residency(Hyderabad) by Robert Melville Grindlay (1786-1877). |
Bhadrachalam by Blunt, James Tillyer (1765-1834). |
Nirmul Fort by Francis Jukes (1746-1812) and Thomas Anburey (1759-1840). |
Bhuuvanagiri Fort ruins by Thomas Anburey (1759-1840) |
Ahobilam by Ward, Benjamin Swain (1786-1835). |
Adoni Fort by Benjamin Swain Ward (1786-1835). |
Gooty east face by Thomas Fraser (1776-1823)
Gooty north face by Thomas Fraser (1776-1823) |
Gooty Third Gagte by Thomas Fraser (1776-1823) |
Gooty West face Thomas Fraser (1776-1823) |
Gandikota (northern entance) by Thomas Anburey (1759-1840). |
Gandikota (north entance) by Thomas Anburey (1759-1840). |
Gandikota (southern entance) by Thomas Anburey (1759-1840). |
Gandikota (east and south face) by Thomas Fraser dated 1802. |
Gandikota (north face) by Thomas Fraser dated 1802. |
Gandikota (west side) by Thomas Fraser dater 1802. |
Gandikota (south entance) by Thomas Anburey, (1759-1840). |
Udayagiri Fort(Nellore) by Colin MacKenzie dated May 1794 Bellamkonda by Ignatio, C dated1819 |
Siddavatam fort north face byThomas Fraser (1776-1823) |
Pedaniakaurgam by John Gant,(1772-1853) |
Kambam tank by unknown 1794 |
Kondavidu Fort R., William( 1784-1816) |
Bellamkonda2 by Colin MacKenzie (1754-1821) |
Bellamkonda by Colin MacKenzie(1754-1821) |
Bellamkonda by unnown 1788 |
Assar fort kadapa by Thomas Fraser (1776-1823) |
Gurramkonda by unknown 1790s |
Kadapa(south view) by Thomas Fraser (1776-1823). Gurramkonda north face by Thomas Fraser (1776-1823) |
Durasapatam Sydenham, Benjamin (1777-1828) |
Yanam river scene by Sigismond Himely (1801-1872 |
Pir Masjid at Yarada hill by C. Ignatio (1816-1819 |
Vizag(north view) by Captain Elisha Trapaud (1750-1828). |
Vizag Seashore with Fort by James Tillyer Blunt (1765-1834). |
Subscribe to:
Posts (Atom)