Friday 30 October 2015

ఇది దురాకాంక్షయేనా?




ఒక చిత్రకారుడు అతని అంతస్తుకు ఎంతో పైనున్న రాకుమారి ప్రేమలో పడితే ? ఆ విషయం ఆమెకే నేరుగా చెబితే ? అతని వర్ణచిత్రాలను ప్రేమించే ఆమె అతని ప్రేమను నిరాకరిస్తుందా? ఏం చేస్తుందో చదవండి కళాసాహితిలో.. ఈ కథ శారద పత్రిక 1924 సెప్టెంబర్ సంచికలో వచ్చింది... 







Tuesday 27 October 2015

హృదయధనము




ఒక చిత్రకారుడు ఒక రంగు కోసం తనను ఎట్లా ఆవిరి చేసుకునున్నాడో చెప్పే భావోద్వేగ కథ.  శారద పత్రిక 1923 ఆగస్టు సంచికలో వచ్చింది. విషయ సూచిక లేకపోవడంతో రచయిత పేరు తెలీడం లేదు. బాపిరాజు కావచ్చా?





Monday 26 October 2015

కళాత్మక కుటుంబం

చిత్రకళ, శిల్పకళల్లో అనాది నుంచి ఆధునిక యుగం వరకు కళాకారులు ప్రేమానురాగాల కుటుంబాన్ని ఎట్లా చిత్రికపట్టారో వివరిస్తూ రాసిన వ్యాసం. అరుణతార 2005 జూన్, జూలై సంచికలో వచ్చింది. అరుణతారలో ఆర్ట్ పై నేను రాసిన వ్యాసాలు చాలా పొడుగ్గా ఉన్నాయని అప్పుడూ అనిపించింది కాని ఇప్పుడు మరింత బాగా అనిపిస్తోంది. ఆర్ట్ పై రాసేవాళ్లు తక్కువ కనక అప్పట్లో నేనేం రాసినా ఎడిట్ చెయ్యకుండా వేసేవాళ్లు. ఇప్పుడు అంత పొడుగు వ్యాసాలు రాసే ఓపికా లేదూ, రాసినా వేసే వాళ్లూ లేరు. 

17వ శతాబ్ది స్పానిష్ చిత్రకారడు వేసిన ‘పవిత్ర కుటుంబం’




Sunday 25 October 2015

కాలం వెంట కదిలిన కుంచె

చిత్రకళలో చరిత్ర ఎట్లా నిక్షిప్తమైందో 2004 మార్చి అరుణతారలో రాసిన వ్యాసం ఇది. 
ఫ్రెంచి రొమాంటిసిస్టు చిత్రకారడు వేడిన ‘స్వేచ్ఛ’ చిత్రం 


Saturday 24 October 2015

ఏకాంత వర్ణాలు (నవతెలంగాణ ఆదివారం సంచిక ‘సోపతి’ బ్యాక్ పేజీ)


విషాద వర్ణవీచికల్లో తరలిపోయిన అమృతా షేర్గిల్






 ‘చైల్డ్ వైఫ్’ 
అమృతా షేర్గిల్(1913-41).. ఒక చెదిరిన మధురస్వప్నం. హఠాత్తుగా కనిపించి మాయమైపోయిన హరివిల్లు. మనకు ఎంఎఫ్ హుసేన్ ఉన్నాడు, యామినీ రాయ్, సూజా, మరెందరో ఉన్నారు. కానీ మనకు అమృత ఒకటే ఉంది. పడికట్టు పదమే అయినా ఆమె మార్గం అనితరసాధ్యం. ఆమె తొట్టతొలి ఆధునిక భారతీయ చిత్రకారిణి. భరతజాతి సుఖదుఃఖాలను అపురూపంగా పరిచయం చేసిన సౌందర్యతూలిక. ఆమెపై రాసిన ఈ వ్యాసం 2007 అరుణతార ఏప్రిల్ సంచికలో వచ్చింది. అప్పటికి నేను అమృత డైరీలను చదవలేదు. ఐదువేల రూపాయల ఖరీదైన ఆ డైరీలను నాలుగేళ్ల కింద తలతాకట్టు వ్యవహారంలాంటి అప్పుచేసి మరీ కొన్నాను.. ఈ వ్యాసం బావుంటే షేర్ చెయ్యండి. అమృత శతజయంతిని తూతూమంత్రంగా కూడా జరుపుకోలేని లోటును ఇలాగైనా పూడ్చుకుందాం.. 






Friday 23 October 2015

కెథే కోల్విజ్ కళా ప్రపంచం: పి.మోహన్




ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనమైన  జర్మన్ చిత్రకారిణి కెథే కోల్విట్జ్(1867-1945)పై నా వ్యాసం. ఇది అరుణతార జూలై 2007 సంచికలో అచ్చయింది. ఇది ఆమెపై వచ్చిన చిన్నపుస్తకం, వ్యాసాల ఆధారంగా రాసింది. ఇది రాశాక ఆమెపై సమగ్రమైన బయాగ్రఫీలు, ఆమె డైరీలు కూడా చదివాను. ఈ వ్యాసం అరుణతార సౌజన్యంతో..









ప్రజాచిత్రకారిణి కెథే కోల్విట్జ్: కొడవటిగంటి కుటుంబరావు

కెథే కోల్విట్జ్(1867-1945) ప్రపంచ ప్రఖ్యాత జర్మన్ చిత్రకారిణి. ప్రజాకళకు నిలువెత్తు నిదర్శనం. 1959లో మద్రాసులో  జరిగిన ఆమె చిత్రాల ఎగ్జిబిషన్ ను చూసి కొడవంటిగంటి కుటుంబరావు అదే ఏడాది మే 17న విశాలాంధ్రలో రాసిన వ్యాసం ఇది. (విరసం పత్రిక అరుణతార, కొడవటింగటి వరూధినిగారి సౌజన్యంతో..)

Tuesday 20 October 2015

అవనీంద్ర స్మృతి : మొక్కపాటి కృష్ణమూర్తి

అవనీంద్రనాథ్ టాగూరు(1871-51) భారత్ గర్వించదగ్గ చిత్రకారుల్లో ఒకరు. బెంగాల్ శైలి చిత్రాలతో కళలో స్వదేశీ విలువలను పాదుకొల్పినవాడు. భరతమాత రూపాన్ని తొలుత రూపుకట్టింది ఆయనే. ఆయన్నికొందరు భారత చిత్రకళాపితామహుడని అంటారు.  మొక్కపాటి కృష్ణమూర్తి తొలినాళ్లలో ఆయన బాటలో నడిచాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక ’అవనీంద్ర  స్మృతి’ పేరుతో ఈ పద్యాలను రాశారు. ఇవి 1952 భారతి ఫిబ్రవరి సంచికలో వచ్చాయి. అవనీంద్రుడి చిత్రాలను జత చేస్తున్నాను.






’ఎడారిలో కాళ్లు తెగిన ఒంటె’

స్నేహం 

భరతమాత(బెంగాలీ కట్టులో)

చిత్రకారుడు

చిత్రకారుడి వ్యాపకం గురించి ఒక కవిత. ఇది 1929 భారతి మార్చి సంచికలో అచ్చయింది. చిత్రకారుడు తాను వేసే బొమ్మలను మనసులోకి ఎట్లా తీసుకుంటాడో, ఏఏ రంగులను ఎలా సేకరించి జనావళి మెచ్చే బొమ్మలను ఎలా వేస్తాడో చెబుతున్నాడు కవి. దీనికింద నాకిష్టమైన వ్యాన్గో సెల్ఫ్ పోర్ట్రేట్.









Saturday 17 October 2015

అతిశయోక్తి అందాలు


మొక్కపాటి కృష్ణమూర్తి చెప్పిన వ్యాన్గో కథ





తెలుగు కుంచె సత్తా చాటిన మొక్కపాటి కృష్ణమూర్తి(1910-1962) చిత్రకారుడు మాత్రమే కాదు, కవీ, కళావిమర్శకుడు కూడా. ఆయన పద్యాలు, కళావిమర్శ వ్యాసాలు భారతి, ఆంధ్రపత్రిక వంటి పత్రికల్లో వచ్చేవి. విన్సెంట్ వ్యాన్గోపై మొక్కపాటి రాసిన ఈ వ్యాసం 1960 జనవరి భారతి సంచికలో వచ్చింది. దీనికి ఇర్వింగ్ స్టోన్ ‘లస్ట్ ఫర్ లైఫ్’ నవల ఆధారమని గట్టిగా చెప్పొచ్చు. ఈ వ్యాసం కూడా నవల్లోని క్రమంలో సాగుతుంది, స్టోన్ కల్పించిన కొన్ని సన్నివేశాలతో సహా.